రామచంద్రపురంలో ఘనంగా ముగిసిన భారీ ఉచిత కంటి వైద్య శిబిరం
రామచంద్రపురంలో ఘనంగా ముగిసిన భారీ ఉచిత కంటి వైద్య శిబిరం. 768 మందికి పైగా రోగులకు ఉచిత కంటి పరీక్షలు వందలాది మందికి ఉచితంగా అద్దాలు, మందుల పంపిణీ మరియు భోజన సౌకర్యం ముఖ్య అతిథులుగా హాజరైన జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్లూరు రాము, ఆర్డీవో Sarala Devi , DMHO డాక్టర్ దుర్గారావు. రామచంద్రపురం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్, ప్రముఖ సీనియర్ ఆప్తాల్మాలజిస్ట్ డాక్టర్ గోపీచంద్ గారి పర్యవేక్షణ మరియు అద్భుతమైన ఆధ్వర్యంలో జూన్ 6వ తేదీన రామచంద్రపురంలో నిర్వహించిన భారీ ఉచిత కంటి వైద్య శిబిరం అత్యంత విజయవంతంగా ముగిసింది. స్థానిక అగ్రహారం, రాజారత్న నగర్‌లోని "రాజా రత్న అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ సెంటర్ అండ్ జనరల్ హాస్పిటల్" వేదికగా, రాజారత్న హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ గోపీచంద్ గారి సుదీర్ఘ వైద్య అనుభవంతో, పూర్తిగా సేవా దృక్పథంతో, ఎటువంటి వాణిజ్య ప్రయోజనాలు లేకుండా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథుల సందడి: ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య అత...